Hyderabad Rains:ఈ దశాబ్దంలో ఈసారే... మార్చ్ నెలలో అత్యధిక వర్షాపాతం

ఆకస్మిక, భారీ వర్షపాతం, అసాధారణ వాతావరణ మార్పులు కూడా ఈ మార్చ్ లో చోటు చేసుకున్నాయి. వడగళ్ళు, బలమైన ఉరుములతో కూడిన గాలివానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Advertisement
Update: 2023-03-20 02:00 GMT

మార్చి 1 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో 51.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణమైన 17.5 మిమీ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ వర్షపాతం గత దశాబ్దపు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది, ఇప్పటి వరకు 2014 మార్చ్ లో నమోదైన 47.3 మి.మీ. వర్షపాతమే అధికం.

ఆకస్మిక, భారీ వర్షపాతం, అసాధారణ వాతావరణ మార్పులు కూడా ఈ మార్చ్ లో చోటు చేసుకున్నాయి. వడగళ్ళు, బలమైన ఉరుములతో కూడిన గాలివానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పర్యావరణంలో అనూహ్య మార్పులే ఈ వర్షాపాతానికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.

ఖమ్మం, హకీంపేట, భద్రాచలం సహా పలు జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా భద్రాచలంలో మార్చి 1 నుంచి 19 వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 92.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.

అయితే, సోమవారం నుండి భారీ వర్షపాతం తగ్గుతుందని, హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Tags:    
Advertisement

Similar News