ఇక సికిందరాబాద్ టూ ఎల్ బీ నగర్ ట్రాఫిక్ కు నో హర్డిల్స్ - పూర్తయిన నాగోల్ ఫ్లై ఓవర్... డ్రోన్ విజువ‌ల్స్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం' లో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈరోజు ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు.

Advertisement
Update: 2022-10-26 06:28 GMT

సికిందరాబాద్ నుండి ఎల్ బీ నగర్ మధ్య ట్రాఫిక్ సమస్యలు ఇక ఉండబోవు. నాగోలు వద్ద ఫ్లై ఓవర్ పూర్తయ్యింది. ఈ ఫ్లై ఓవర్ ను మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈరోజు ( బుధవారం) ప్రారంభించనున్నారు. ఒక్కో వైపు మూడు లైన్లతో ఉన్న ఈ ఫ్లై ఓవర్ వల్ల వాహనదారులు అత్యంత సాఫీగా ప్రయాణం సాగించవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వం కామినేని కూడలి, ఎల్బీ నగర్ కూడలి, బైరామల్ గూడ, ఒవైసీ ఆస్ప త్రి , చాం ద్రాయణగుట్ట కూడళ్లపై ఫ్లై ఓవర్ లు నిర్మించింది. ఈ రోజు ప్రారంభం కాబో యే ఫ్లై ఓవర్ తో ఉప్ప ల్-ఆరాంఘర్ చౌరస్తా వరకు వాహనదారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చని జీహెచ్ ఎంసీ ఓ ప్రకటనలో తెలిపిం ది.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(SRDP) కింద చేపట్టి, పూర్తి చేసినపనుల్లో ఈ రోజు ప్రారంభం కాబోయే నాగోలు ఫ్లై ఓవర్ 16వది. ఇప్పటికే 15 ఫ్లై ఓవర్ లు పూర్త‌య్యాయి. ఇవే కాక 5 అండర్ పాస్ లు, 7 రైల్ ఓవర్ బ్రిడ్జ్/ రోడ్ అండర్ బ్రిడ్జ్ (ROB/RUB) లు, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు ఫ్లై ఓవర్ ల‌ నిర్మాణం తుది దశలో ఉందని, నవంబరులో శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్, డిసెంబరులో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ చౌరస్తాల్లో నిర్మించిన ఫ్లై ఓవర్ లు అందుబాటులోకి వస్తాయని జీహెచ్ ఎంసీ తెలిపిం ది.

నాగోలులో ఈ రోజు కేటీఆర్ ప్రారంభించనున్న ఫ్లై ఓవర్ రూ.143.58 కోట్లతో పూర్తిచేసినట్లుజీహెచ్ ఎంసీ తెలిపిం ది. 990మీటర్ల పొడవు, ఆరు లైన్ల వెడల్పు తో ఇరువైపులా రాకపోకలు ఉం డేలా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణమైంది.


Tags:    
Advertisement

Similar News