ఓట్ల కోసమే కొత్త హామీలు.. రేవంత్‌కు హరీష్‌ ప్రశ్నలు

వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని.. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 2500 చొప్పున ఇస్తామన్న మాట మరిచిపోయారంటూ హరీష్ గుర్తు చేశారు.

Advertisement
Update: 2024-04-16 02:33 GMT

రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్‌ హామీలపై రేవంత్ చేసిన కొత్త ప్రకటనపై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని కొత్తగా హామీ ఇస్తున్నారంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు.

బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి భయపడే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన చేశారన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్‌ రెడ్డికి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఎకరానికి రూ. 15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన ఇప్పటివరకూ కాంగ్రెస్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.


వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని.. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 2500 చొప్పున ఇస్తామన్న మాట మరిచిపోయారంటూ హరీష్ గుర్తు చేశారు. 4 వేలకు పెంచుతామన్న పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారో చెప్పాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఓడిపోతామన్న భయంతోనే కొత్త హామీలు ఇస్తున్నారని ఆరోపించారు హరీష్‌ రావు.

Tags:    
Advertisement

Similar News