టిమ్స్‌పై కోమటిరెడ్డి అబద్ధాలు.. హరీష్ రావు కౌంటర్‌

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేసిందన్నారు హరీష్ రావు. హాస్పిటల్స్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Advertisement
Update: 2024-05-24 11:30 GMT

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన టిమ్స్‌ హాస్పిటల్‌ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను తప్పుపట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్మడం బాధాకరమన్నారు. జ‌నాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందించాలన్న కేసీఆర్ నిర్ణయంతో టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం గత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.


అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేసిందన్నారు హరీష్ రావు. హాస్పిటల్స్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. టిమ్స్ హాస్పిటల్స్‌పై R&B మంత్రి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. టిమ్స్‌ ఎల్బీనగర్ హాస్పిటల్‌ జి+14 మాత్రమేనన్న హరీష్‌ రావు.. 27 అంతస్తులు అని చెప్పడం మంత్రి కోమటిరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఎక్కువ అంతస్తులు కడితే పేషంట్లు ఇబ్బందులు పడతారని మొసలి కన్నీరు కారుస్తున్న మంత్రికి.. 2022 ఏప్రిల్ 5న రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ జైపూర్‌లో 24 అంతస్తుల హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇక ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆస్పత్రి కనిపించడం లేదా అని ప్ర‌శ్నించారు. నిరుపేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉంటే వేగంగా టిమ్స్‌ నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు హరీష్ రావు. కానీ, చౌకబారు కామెంట్స్ చేసి స్థాయి తగ్గించుకోవద్దని కోమటిరెడ్డికి సూచించారు.

ఇంతకీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..?

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ టిమ్స్‌ను సుప్రీంకోర్టు, NMC మార్గదర్శకాలకు విరుద్ధంగా 27 అంతస్తుల్లో చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఎవరైనా రోగిని పై అంతస్తులకు తీసుకుపోతుండగా మధ్యలో కరెంటు పోతే పరిస్థితేంటన్నారు. అందుకే టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని 14 అంతస్తులకు కుదిస్తామన్నారు. అయితే దీనిపై మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి చెప్పినట్లుగా టిమ్స్ నిర్మాణం 27 అంతస్తుల్లో చేపట్టలేదని.. జి+14 మాత్రమేనన్నారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Tags:    
Advertisement

Similar News