GHMC చరిత్రలో తొలిసారి.. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన అధికారులు, సిబ్బంది

కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో అధికారులను ఉద్దేశించి బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడిన తీరు చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీ సభ్యులు మంగళవారం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కార్యాలయంలోకి చొరబడి లోపల చెత్త‌ వేయడం కూడా సరికాదని ఆమె అన్నారు.

Advertisement
Update: 2023-05-03 10:44 GMT

ఈ రోజు జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారి అర్దాంతరంగా ముగిసింది. సమావేశానికి ముందే బీజేపీ కార్పోరేటర్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేస్తూనే సమావేశానికి వచ్చారు. హైదరాబాద్ లో వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారిని అసభ్యంగా దూషించారు. దీంతో పౌరసరఫరాల జోనల్‌ కమిషనర్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు సభ నుంచి వాకౌట్ చేశారు

అనంతరం మీడియాతో మాట్లాడిన జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు కౌన్సిల్‌లో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులపై బీజేపీ కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడారని మండిపడ్డారు.

కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో అధికారులను ఉద్దేశించి బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడిన తీరు చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీ సభ్యులు మంగళవారం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కార్యాలయంలోకి చొరబడి లోపల చెత్త‌ వేయడం కూడా సరికాదని ఆమె అన్నారు.

ఇదిలావుండగా.. ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, అధికారులను అగౌరవపరిచేందుకు కాదని బిజెపి సభ్యులు మాట్లాడిన భాష బాగాలేదని అని మేయర్ జి. విజయలక్ష్మి అన్నారు.

Tags:    
Advertisement

Similar News