రైతుబంధుకు ఐదేళ్లు వర్ధిల్లాలి వెయ్యేళ్లు – నిరంజన్ రెడ్డి

2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌ పుస్తకాలు ఇచ్చి రైతుబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు.

Advertisement
Update: 2023-05-11 02:10 GMT

రైతుబంధు పథకం ప్రారంభించి బుధవారంతో ఐదేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులతో కలిసి కేక్ కట్ చేశారు. రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. రైతును గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో సీఎం కేసీఆర్ జమ చేసినట్టు చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సంస్థ (FAO) 2018 - 19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతుబంధు, రైతుబీమాను గుర్తించిందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్దఎత్తున చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఒకప్పుడు ధీనంగా ఉన్న రైతన్న నేడు ఎవ్వరికీ బెదరకుండా గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడు అని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, జాతీయ నినాదం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, మేధావులను, బుద్ధిజీవులను ఆలోచింపచేస్తుందన్నారు.

2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌ పుస్తకాలు ఇచ్చి రైతుబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News