కలుస్తున్న చేతులు.. చేరికలతో బలపడుతున్న నేతలు

బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎర్ర శేఖర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు తాను కూడా ప్రచారానికి వస్తానని మాటిచ్చారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాననన్నారు.

Advertisement
Update: 2023-10-30 08:16 GMT

కలుస్తున్న చేతులు.. చేరికలతో బలపడుతున్న నేతలు

మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలపడుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చేరికతో బీఆర్ఎస్ కి ముదిరాజ్ లు మరింత దగ్గరవుతున్నారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా బేషరతుగా బీఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్.. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తనవంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిశారు. ఆయనతోపాటు ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎర్ర శేఖర్ పాల్గొంటారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎర్ర శేఖర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు తాను కూడా ప్రచారానికి వస్తానని మాటిచ్చారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాననన్నారు. గత పదేళ్లుగా మహబూబ్‌ నగర్ నియోజకవర్గాన్ని ఊహించని విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేశారన్నారు. ఆయనకు లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఖాయమన్నారు ఎర్ర శేఖర్.

ఈ సందర్భంగా మారుతున్న మహబూబ్‌ నగర్ ముఖచిత్రం అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్.. శేఖర్ కు అందించారు. ఆ అభివృద్ధి కళ్లకు కడుతోందని, బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు ఎర్ర శేఖర్. గతంలో తాను సీఎం కేసీఆర్ తో కలసి పనిచేశానని, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నియోజక అభివృద్ధికి ఎంతగానో సహకరించారని గుర్తు చేసుకున్నారు ఎర్ర శేఖర్. ముదిరాజ్ ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC