తెలంగాణలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలు.. కౌన్సిలింగ్ షెడ్యూల్‌ ఇదే

జూన్ 30 నుంచి విద్యార్థులు ఫస్ట్ ఫేజ్‌ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జులై 12న ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.

Advertisement
Update: 2024-05-24 11:41 GMT

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ రిలీజ్ చేసింది. మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. జూన్‌ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30 నుంచి విద్యార్థులు ఫస్ట్ ఫేజ్‌ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జులై 12న ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.

జులై 19 నుంచి ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్‌ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జులై 24న రెండో విడత సీట్ల కేటాయించాననున్నారు. ఇక చివరి విడత కౌన్సిలింగ్‌ జులై 30న నిర్వహించి.. ఆగస్టు 5న చివరి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది.

షెడ్యూల్ ఇలా..

  • జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
  • జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు ఛాన్స్
  • జులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపు
  • జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
  • జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపు
  • జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్
  • ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపు
  • ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయం
  • ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ
  • ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్‌ విడుదల
Tags:    
Advertisement

Similar News