నిర్మల్ లో టెన్షన్ టెన్షన్.. ఏలేటి దీక్ష భగ్నం

తెల్లవారు జామున 3గంటల సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేతలు అడ్డుపడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు అంబులెన్స్ లో ఆయనను ఆస్పత్రికి చేర్చారు.

Advertisement
Update: 2023-08-21 03:16 GMT

నిర్మల్ మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షని పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్ కి తరలిస్తామని తెలిపారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం నిర్మల్ లోనే ఉంచి చికిత్స అందించాలని కోరుతున్నారు. మరో వైపు మహేశ్వర్ రెడ్డి తన దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నారు.

నిర్మల్ మాస్టర్ ప్లాన్ జీవో 220 రద్దు కోరుతూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు దీక్ష శిబిరానికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయడంతో కలకలం రేగింది. తెల్లవారు జామున 3గంటల సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేతలు అడ్డుపడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు అంబులెన్స్ లో ఆయనను ఆస్పత్రికి చేర్చారు.





కిషన్ రెడ్డి పర్యటన..

ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిని పరామర్శించేందుకు టీబీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. నిర్మల్‌ వస్తున్నట్టు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆయన నిర్మల్ వస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే అత్యవసర మీటింగ్ ల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం కావడంతో కిషన్ రెడ్డి హడావిడిగా నిర్మల్ బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈరోజు నిర్మల్ లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బందోబస్తు పెంచారు. 

Tags:    
Advertisement

Similar News