బీజేపీ రచ్చపై ఈసీ కౌంటర్

ఎన్నికల అధికారులు టీఆరెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ నాయకుల ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించి‍ంది

Advertisement
Update: 2022-11-06 06:20 GMT

మునుగోడు ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు టీఆరెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ లు చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.

ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ కు ఓ ప్రొసీజర్ ఉంటుందని, కౌంటింగ్ కు గానీ, అధికారికంగా ఫలితాలు ప్రకటించడానికి ఉన్న ప్రొసీజర్ ప్రకారమే తాము వ్యవహరిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  


మరో వైపు ఎన్నికల కమిషన్ అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించడం పట్ల రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఓ స్వతంత్ర సంస్థతో కేంద్రమంత్రి ఇలా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు.

కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమవుతోందని జగదీష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News