హైదరాబాద్‌లో విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్‌.. మీరు చూశారా!

ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న కోహ్లీ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Advertisement
Update: 2024-05-24 07:53 GMT

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ.. బిజినెస్‌లోనూ దూసుకుపోతున్నాడు. 2017 నుంచి వన్‌ 8 కమ్యూన్‌ పేరుతో రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌.. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, బెంగళూరులో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్‌ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. హైటెక్‌ సిటీలోని హార్డ్‌ రాక్ కేఫ్‌ సమీపంలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.


ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న కోహ్లీ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తనకు వన్‌ 8 కమ్యూన్ అనేది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదని.. హైదరాబాద్‌ ప్రజలను ఒకేచోటుకు చేర్చడం ఈ రెస్టారెంట్‌ ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

ఈ రెస్టారెంట్‌ డిఫరెంట్‌ ఫుడ్‌తో పాటు క్రికెట్‌ వైబ్, సినిమాటిక్ అనుభవాలను అందించనుంది. ఎంతో ఆకర్షణీయంగా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌తో పాటు ఫుడ్‌ లవర్స్‌కు డెస్టినేషన్‌గా ఈ రెస్టారెంట్‌ను అభివర్ణిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News