మునుగోడు టీఆరెస్ సభకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

మునుగోడులో ఇవ్వాళ్ళ జరగనున్న టీఆరెస్ బహిరంగ సభకు సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది.

Advertisement
Update: 2022-08-20 04:55 GMT

మునుగోడు లో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరు కావాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆరెస్ తో కలిసి వెళ్లాలని పార్టీ నిర్ణయించుకోవడమేగాక .. తమ మద్దతును ప్రకటించి.. సస్పెన్స్ కి తెర దించింది. శనివారం సీఎం కేసీఆర్ వెంట సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కూడా మునుగోడు వెళ్లనున్నారు. ఈ ఎన్నికలో తమ పార్టీ ప్రచార కార్య్రక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్.. సీపీఐ నేతలను కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడ గెలుపు ఓటములను నిర్ణయించేది తామేనని, బీజేపీని ఓడించాలన్నదే తమ ధ్యేయమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఇదివరకే ప్రకటించారు. నిన్న మొన్నటివరకు ఈ పార్టీ మద్దతుకోసం టీఆరెస్ అన్ని ప్రయత్నాలు చేసింది. మంత్రి జగదీష్ రెడ్డి ఇందుకు ఈ పార్టీ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా టీఆరెస్ కి తమ సపోర్ట్ ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది కూడా.. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగానే ఉండడంతో.. సహజంగానే అధికార పార్టీ.. లెఫ్ట్ పార్టీల మద్దతును కోరవచ్చునని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి.

ఈ నియోజకవర్గంలో 1985-2014 మధ్య జరిగిన ఆరు సార్వత్రిక ఎన్నికలకు గాను 5 ఎన్నికల్లో సీపీఐ విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ ఈ పార్టీ ఓటు బ్యాంకు తగ్గినప్పటికీ.. పల్లావెంకటరెడ్డి వంటి నేతల పలుకుబడి ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం.. మునుగోడు ఎన్నికలో తమ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గానీ, బీజేపీకి గానీ ఓటు వేయరని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడే సూచనప్రాయంగా ఈ పార్టీ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ లో శుక్రవారం రాత్రి కేసీఆర్, సీపీఐ నేతల మధ్య సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలు ..క్లైమాక్స్ కి ముగింపు పలికాయి.




Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC