స్టేషన్‌లో కాంగ్రెస్ ZPTC భర్త చిందులు.. వావ్ సూపర్‌ అన్న పోలీసులు

బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చారని స్థానికులు మండిపడున్నారు. అలాగే పోలీసుల పేరు చెప్పి శ్రీనివాస్ ఇసుక క్వారీల్లోనూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Update: 2024-04-15 10:36 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో కాంగ్రెస్ జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే డ్యాన్సులు వేస్తూ వీడియో చిత్రీకరించడం సంచలనంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌ను డ్యాన్స్‌ క్లబ్‌గా మార్చి `నేనున్నాను` సినిమా పాటకి స్టెప్పులేస్తూ ఆడిపాడాడు. అంతేకాదు ప్రభుత్వ అధికారులు తాను చెప్పినట్టు నడుచుకుంటారని స్నేహితులకు శ్రీనివాస్ వీడియో పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చారని స్థానికులు మండిపడున్నారు. అలాగే పోలీసుల పేరు చెప్పి శ్రీనివాస్ ఇసుక క్వారీల్లోనూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారం అండ చూసుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని మహదేవ్‌పూర్ వాసులు కోరుతున్నారు. స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డాన్సులపై పోలీసులు ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Tags:    
Advertisement

Similar News