నోరు జారిన రాజగోపాల్.. అసహనంలో తుమ్మల, ఆగ్రహంలో రేవంత్

రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌గా మారాయి. గతంలో తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గు, శరం లేని పని అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభత్వంలో కూడా మంత్రి పదవి ఎందుకిచ్చారనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
Update: 2024-03-24 04:10 GMT

తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కాని తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన విషయంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినా.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన విషయాన్ని గుర్తించలేకపోయారు. అసలు తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న విషయాన్నే రాజగోపాల్‌ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. అందుకే తుమ్మల బీఆర్‌ఎస్‌ నేతే అన్న భ్రమలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు

రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌గా మారాయి. గతంలో తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గు, శరం లేని పని అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభత్వంలో కూడా మంత్రి పదవి ఎందుకిచ్చారనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఇప్పుడు సొంతపార్టీ నేతనే అన్న సోయి కూడా రాజగోపాల్‌ రెడ్డికి లేకపోతే ఎలా? అని అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రభుత్వంలోని ముఖ్యనేతలు సైతం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News