గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ

కాంగ్రెస్‌ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు సైతం వంకాయ ప్రచారానికి తెరలేపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఇచ్చింది వంకాయ.

Advertisement
Update: 2024-05-09 08:56 GMT

తెలంగాణలో గాడిద గుడ్డు, వంకాయ రాజకీయం నడుస్తోంది. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ముందు కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ప్రచారాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. పదేళ్లలో తెలంగాణకు ప్రధానిమోడీ గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు సైతం వంకాయ ప్రచారానికి తెరలేపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఇచ్చింది వంకాయ. 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్నివర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి వంకాయ చేతిలో పెట్టాడని బీజేపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News