త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు.. జీతం రూ.6 వేలు

ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికైనా ఈ కమిటీ ద్వారానే అర్హులు, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Advertisement
Update: 2024-04-11 02:57 GMT

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క కమిటీ సభ్యుడికి రూ.6 వేల గౌరవ వేతనం అందిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్‌పై సమీక్ష సందర్భంగా ఈ ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి.

ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికైనా ఈ కమిటీ ద్వారానే అర్హులు, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైనా రేవంత్ చర్చించారు. ఎంపీ ఎన్నికలు పూర్తి కాగానే.. జూన్‌ ఫస్ట్‌ వీక్‌లో లోకల్‌ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లోకల్‌ బాడీ ఎన్నికలు పూర్తయితే పూర్తిస్థాయిలో మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చని సీఎం రేవంత్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News