ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు 

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు హెల్త్‌ స్కీమ్‌ అమలు చేయడం సంతోషకరమైన అంశమని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ప్రత్యేకంగా ట్రస్ట్‌ కూడా ఏర్పాటు చేయడంపై ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Update: 2023-10-09 01:48 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్టును ఏర్పాటుచేసిన సీఎం.. కొత్తగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ అమలుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పింఛనుదారులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. అంతేకాదు.. ఈ పథకం నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. అధికారులు, ఉద్యోగులు, పింఛను దారులు ఈ బోర్డులో సభ్యులుగా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి జీవో నంబర్‌ 186ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

హెల్త్‌ స్కీమ్‌పై మంత్రి హరీష్‌రావు హర్షం

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు హెల్త్‌ స్కీమ్‌ అమలు చేయడం సంతోషకరమైన అంశమని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ప్రత్యేకంగా ట్రస్ట్‌ కూడా ఏర్పాటు చేయడంపై ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త పథకంతో ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఉద్యోగులు, పింఛను దారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC