4 నెలలకోసారి ప్రజాపాలన.. లబ్ధిదారుల ఎంపిక ఎలా అంటే..!

ప్రజాపాలన కార్యక్రమంపై బుధవారం చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6 నుంచి 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు.

Advertisement
Update: 2024-01-04 03:13 GMT

ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రజాపాలన గడువు ముగియనుంది. తేదీ పొడిగింపు ఉండదని.. ఈ నెల 6వ తేదీలోపే అందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రజాపాలన కార్యక్రమంపై బుధవారం చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6 నుంచి 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. ఈనెల 17 లోపు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుందన్నారు.

డేటా ఎంట్రీ ప్రక్రియ కోసం ఈనెల 4న రాష్ట్రస్థాయి సిబ్బందికి, ఈనెల 5న జిల్లా స్థాయి సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. ఆధార్‌, రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేస్తామన్నారు. ఇకపై నాలుగు నెలలకోసారి ప్రజా పాలన సదస్సులు నిర్వహిస్తామని.. ఇప్పుడు దరఖాస్తు చేయని వారు అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Tags:    
Advertisement

Similar News