అసదుద్దీన్‌పై పోటీ చేస్తున్న మాధవీలతకు Y+ భద్రత అందుకేనా?

హైద‌రాబాద్ నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది.

Advertisement
Update: 2024-04-06 10:04 GMT

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించింది. ఈ మేర‌కు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ముప్పు ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాధవీలతకు Y+ భద్రత కలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం.

వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉంటారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది.

హైద‌రాబాద్ నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో మజ్లి‌స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్‌ మాధవీలతకు టికెట్‌ ఖరారు చేసింది. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరు.

Tags:    
Advertisement

Similar News