తెలంగాణలో బ్రూ ట్యాక్స్

ఆ ముగ్గురు ప్రజల వద్ద ప్రత్యేక పన్నులు వసూలు చేస్తున్నారని, అలా వసూలు చేసిన సొమ్ముతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్.

Advertisement
Update: 2024-05-25 04:59 GMT

బ్రూ కాఫీ గురించి మనందరికీ తెలుసు, కానీ తెలంగాణలో బ్రూ(BRU) ట్యాక్స్ మొదలైన విషయం మీకు తెలుసా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో BRU(భట్టి, రేవంత్, ఉత్తమ్)ర ట్యాక్స్ మొదలైందని అన్నారు కేటీఆర్. ఆ ముగ్గురు ప్రజల వద్ద ప్రత్యేక పన్నులు వసూలు చేస్తున్నారని, అలా వసూలు చేసిన సొమ్ముతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు. వసూలు చేసిన సంచుల్ని ఢిల్లీకి పంపించడంలో వారు బిజిగా ఉన్నారని చెప్పారు కేటీఆర్.


30వేల ఉద్యోగాలా..?

నోటిఫికేషన్ ఇవ్వకుండా, కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా పెట్టకుండా 30వేల ఉద్యోగాలు భర్తీ చేశానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. పెళ్లి, కాపురం లేకుండానే బిడ్డలు ఎలా పుట్టారని నిలదీశారు కేటీఆర్. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ అయితే ఆ ఘనత తనదేని రేవంత్ చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు కేటీఆర్.

తాను రెండు మాస్టర్ డిగ్రీలు చేశానని, చిట్టీలు పెట్టే అలవాటు తనకు లేదని, తనలాగే చాలామంది చదువుకుని ఉంటారని, వారందరికీ రేవంత్ రెడ్డి భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల వ్యవహారం అంతు చిక్కకుండా ఉందన్నారు కేటీఆర్. మరీ ఇంత దొంగ మాటలు చెప్పడం అవసరమా అని ప్రశ్నించారు.  

Tags:    
Advertisement

Similar News