గుత్తాకు షాక్ ఇచ్చే ప్లాన్‌లో గులాబీ పార్టీ

కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారంటూ గుత్తా సంచలన కామెంట్స్ చేశారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Update: 2024-05-27 03:09 GMT

శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మండలిలో గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల టైమ్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులు సైతం గంపగుత్తగా కాంగ్రెస్‌లో చేరారు. ఆయ‌న సైతం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్తున్నారు. నిజానికి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి.. నల్గొండ లేదా భువనగిరి పార్లమెంట్ స్థానాల నుంచి బీఆర్ఎస్‌ టికెట్ ఆశించారు. కానీ, నల్గొండ జిల్లా నేతలు వ్యతిరేకించడంతో అమిత్ రెడ్డి పోటీపై వెనక్కి తగ్గారు. కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారంటూ గుత్తా సంచలన కామెంట్స్ చేశారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాలతో గుత్తా సుఖేందర్ రెడ్డిని పదవి నుంచి దింపాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40గా ఉంది. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగగా.. ఇంకా ఫలితాలు రాలేదు. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు స్థానాలు మినహాయిస్తే ప్రస్తుతం మండలిలో 36 మంది సభ్యులు ఉన్నారు. మండలి ఛైర్మన్‌ను దింపేందుకు మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉండాలి. ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం 26 మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 30 మంది సభ్యులు ఉన్నట్లు మండలి రికార్డులు చెప్తున్నాయి. కానీ ఇప్పటికే దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలుపుకుంటే కాంగ్రెస్‌లో చేరిన వారి సంఖ్య మూడుకు చేరింది. వీరిని మినహాయిస్తే బీఆర్ఎస్‌కు 27 మంది సభ్యుల బలం ఉంది. MIMకు ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News