ఎగిరేవాళ్ల బతుకులు మూడో తేదీ బయటపడతాయి..

విజయంపై బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తమకు విజయాన్ని అందిస్తాయంటున్నారు.

Advertisement
Update: 2023-12-01 11:52 GMT

కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా.. ఎగ్జాట్ పోల్ రిజల్ట్ మాత్రం తమకే అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికలు జరిగిన రోజు కేటీఆర్, కవిత సహా.. ఒకరిద్దరు నేతలు మాత్రమే మీడియా ముందుకు రాగా ఈ రోజు మరికొందరు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ ది హ్యాట్రిక్ విజయం అని చెప్పారు. అయితే ఈ ఎన్నికలు తనకు గుణపాఠం నేర్పాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికలు తనకు గుణపాఠాన్ని, రాజకీయాన్ని నేర్పాయని చెప్పారు మహబూబాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌ నాయక్‌. ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. 14 ఏళ్ల పోరాటం, పదేళ్ల అభివృద్ధి కలసి కేసీఆర్ అని అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మిగిలిపోయిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకే తాను ఈ సారి పోటీ చేశానని అన్నారు. ప్రజల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు శంకర్ నాయక్.

ఎగిరేవాళ్ల బతుకులు..

కొంతమంది విజయం ఖాయమైందంటూ ఎగిరెగిరి పడుతున్నారని.. అలాంటి వాళ్ల బతుకులు ఈనెల 3న బయటపడతాయని చెప్పారు శంకర్ నాయక్. ప్రజల నిర్ణయం ఏదైనా తాను శిరసావహిస్తానని, ప్రజల్ని వదిలిపెట్టిపోనని చెప్పారు. ఎప్పుడూ వారితోనే, వారిలో ఒకడిగా ఉంటానన్నారు.



Tags:    
Advertisement

Similar News