17 రోజులు, 22 రోడ్‌ షోలు.. కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

ఈ నెల 22న నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

Advertisement
Update: 2024-04-21 04:05 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ రూట్‌ మ్యాప్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సు యాత్ర ఉండేలా రూట్‌ మ్యాప్ తయారు చేశారు.

ఈ నెల 22న నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్రలో భాగంగా రోజూ ఉదయం పొలంబాట కార్యక్రమం, సాయంత్రం 2, 3 ప్రాంతాల్లో రోడ్‌షోలు ఉండేలా ప్లాన్ చేశారు. మధ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు కేసీఆర్. యాత్రలో భాగంగా బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తల ఇళ్లలోనే బస చేయనున్నారు కేసీఆర్.


వచ్చే నెల మే 10న సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభతో కేసీఆర్ యాత్ర ముగియనుంది. అయితే ఆదిలాబాద్‌ పార్లమెంట్ దూరాభారం దృష్ట్యా అక్కడికి హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు గులాబీ బాస్. మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. 

Tags:    
Advertisement

Similar News