TSPSC పేపర్ లీకేజీ ఇష్యూలో BJP హస్తం: సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరిన‌ KTR

‘‘తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికే బీజేపీ అమాయక యువత జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నినట్లుంది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించి నేరస్తులను గుర్తించాలని నేను తెలంగాణ డిజిపిని అభ్యర్థిస్తున్నాను..." అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Update: 2023-03-16 01:58 GMT

TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందన్న అనుమానంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆ కోణంలో కూడా పోలీసు విచారణ జరిపించాలని కోరారు.

రెండవ నిందితుడు అట్ల రాజశేఖర్ చురుకైన బిజెపి కార్యకర్త అని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి యొక్క స్వంత సోషల్ మీడియా పోస్ట్‌లతో పాటు, ఇతర బిజెపి కార్యకర్తలతో ఆయన కలిసున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అతనికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సంబంధం ఉన్నట్లు నివేదికలు కూడా ఉన్నాయి.

ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం. అని ఆరోపించారు.

‘‘తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికే బీజేపీ అమాయక యువత జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నినట్లుంది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించి నేరస్తులను గుర్తించాలని నేను తెలంగాణ డిజిపి గారిని అభ్యర్థిస్తున్నాను..." అని కేటీఆర్ అన్నారు.


Tags:    
Advertisement

Similar News