కవితపై 'బండి' అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎంపీ అరవింద్

బండి సంజయ్ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లను సంజయ్ అనుచరులైన బీజేపీ నేతలు సమర్దిస్తున్నారు. అందులో మహిళా నేతలు కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఆ పార్టీలోని మిగతా నాయకులకు భిన్నంగా స్పంధించారు.

Advertisement
Update: 2023-03-12 13:09 GMT

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ క్షమాపణలుచెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ శ్రేణులు ఈ రోజు కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగించారు.

మరో వైపు బండి సంజయ్ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లను సంజయ్ అనుచరులైన బీజేపీ నేతలు సమర్దిస్తున్నారు. అందులో మహిళా నేతలు కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఆ పార్టీలోని మిగతా నాయకులకు భిన్నంగా స్పంధించారు.

ఆదివారం అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను ఎంత మాత్రం సమర్ధించబోనని స్పష్టం చేశారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అరవిండ్ డిమాండ్ చేశారు. సామెతలను ఉపయోగించే సమయంలో కాస్త ఆలోచిస్తే మంచిదని ఆయన హితవు పలికారు. బీజేపీ అధ్యక్షుడంటే పవర్ సెంటర్ కాదని , అందరిని సమన్వయం చేసే బాధ్యత అని గుర్తుంచుకోవాలని అరవింద్ అన్నారు.

అరవింద్ మాటలపై ఇప్పుడు బీజేపీలో తీవ్ర చర్చ సాగుతోంది. అరవింద్ బహిరంగంగా సంజయ్ మాటల‌ను ఖండించడంపై సంజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వీరిద్దరి మధ్య ఇంత కాలంగా సాగుతున్న కోల్డ్ వార్ ఎట్టకేలకు బహిరంగమైందనిమరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News