నల్లమల యురేనియం అంశాన్ని మళ్ళీ తెరమీదికి తెచ్చిన బీజేపీ... భగ్గుమన్న గిరిజ‌నులు

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు నిరసనగా నిన్న యురేనియం వ్యతిరేక జేఏసీ, నల్లమల పోరాట సమితి ల అద్వర్య‍లో ప్రదర్శన నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement
Update: 2023-04-16 04:23 GMT

నల్లమల లో యురేనియం తవ్వకాల అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. యురేనియం తవ్వకాలను ఆదివాసులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో వెనక్కి తగ్గిన కేంద్ర బీజేపీ సర్కార్ మళ్ళీ తవ్వకాల రాగం అందుకుంది.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలతో నల్లమల ప్రాంతంలో మళ్ళీ కలకలం రేగింది.

లక్ష్మణ్ వ్యాఖ్యలకు నిరసనగా నిన్న యురేనియం వ్యతిరేక జేఏసీ, నల్లమల పోరాట సమితి ల అద్వర్య‍లో ప్రదర్శన నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర బీజేపీ సర్కార్ నల్లమలను విదేశీ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని నల్లమల పోరాట సమితి అధ్యక్షుడు నాసరయ్య ఆరోపించారు.

మరో వైపు బీకే ఉప్పునుంతల, తిర్మలాపూర్‌ తదితర గ్రామాల్లో సీపీఐ,సీపీఎం,యురేనియం వ్యతిరేక జేఏసీ, గిరిజన సంఘం నాయకులతో కలిసి పర్యావరణ వేత్త‌ నరసింహారావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

కాగా, అంతకు ముందురోజు , లక్ష్మణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పలు గిరిజన సంఘాలు కేంద్ర బీజేపీ సర్కార్ దిష్టి బొమ్మను దహనం చేశాయి.నల్లమల యురేనియం అంశాన్ని మళ్ళీ తెరమీదికి తెచ్చిన బీజేపీ... భగ్గుమన్న గిరిజ‌నులు

నల్లమల లో యురేనియం తవ్వకాల అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. యురేనియం తవ్వకాలను ఆదివాసులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో వెనక్కి తగ్గిన కేంద్ర బీజేపీ సర్కార్ మళ్ళీ తవ్వకాల రాగం అందుకుంది.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలతో నల్లమల ప్రాంతంలో మళ్ళీ కలకలం రేగింది.

లక్ష్మణ్ వ్యాఖ్యలకు నిరసనగా నిన్న యురేనియం వ్యతిరేక జేఏసీ, నల్లమల పోరాట సమితి ల అద్వర్య‍లో ప్రదర్శన నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర బీజేపీ సర్కార్ నల్లమలను విదేశీ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని నల్లమల పోరాట సమితి అధ్యక్షుడు నాసరయ్య ఆరోపించారు.

మరో వైపు బీకే ఉప్పునుంతల, తిర్మలాపూర్‌ తదితర గ్రామాల్లో సీపీఐ,సీపీఎం,యురేనియం వ్యతిరేక జేఏసీ, గిరిజన సంఘం నాయకులతో కలిసి పర్యావరణ వేత్త‌ నరసింహారావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

కాగా, అంతకు ముందురోజు , లక్ష్మణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పలు గిరిజన సంఘాలు కేంద్ర బీజేపీ సర్కార్ దిష్టి బొమ్మను దహనం చేశాయి. 

Tags:    
Advertisement

Similar News