బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు.. పోలీసుల ముందుకు హేమ!

ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు.

Advertisement
Update: 2024-05-27 03:48 GMT

రేవ్‌ పార్టీ కేసులో నిందితులను ఇవాళ విచారణ చేయనున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే రేవ్‌ పార్టీకి తాను హాజరుకాలేదని చెప్తున్న హేమ.. పోలీసుల విచారణకు హాజరవుతారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

ఇక ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేస్తారని తెలుస్తోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీపై వారం క్రితం మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందిన టెకీలు, సినీ నటులు, మోడల్స్‌ ఉన్నట్లు చెప్పారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News