కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు.. బీఆరెస్ కార్యకర్తల నిరసనలు

హైదరాబాద్ లో బీఆరెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో నిరసనలకు నాయకత్వం వహించారు.

Advertisement
Update: 2023-03-11 09:22 GMT

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆరెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

హైదరాబాద్ లో బీఆరెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో నిరసనలకు నాయకత్వం వహించారు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద,జూబ్లీ హిల్స్, పంజా గుట్ట వద్ద, ఢిల్లీలో బీఆరెస్ శ్రేణులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మాలోతు కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి.. ఓ మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నోటికి హద్దు అదుపు లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని.. తీరు మార్చుకోకపోతే మెంటల్ ఆస్పత్రిలో చేర్చి ట్రిట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆమె హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ అద్వర్యంలో నిరసనలు జరిగాయి. బండిసంజయ్ కవిత గురించి మాట్లాడిన అనుచిత మాటలపై గోపీనాథ్ భగ్గుమన్నారు. తనకూ భార్యా పిల్లలున్నారు. ఆయనకు మహిళలపట్ల కనీస గౌరవం లేదని , ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని గోపీనాథ్ మండిపడ్డారు.

హైదరాబాద్ లోని అనేక చోట్ల బీఆరెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆరెస్ మహిళా కార్యకర్తలు బండిసంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.

Tags:    
Advertisement

Similar News