రేవంత్ రెడ్డితో బాలయ్య భేటీ.. ఎందుకంటే..?

ఆ ధరఖాస్తును త్వరలోనే ఆమోదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
Update: 2024-05-26 09:50 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటసేపు వారిద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నారని సమాచారం. ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, ఫలితాలతోపాటు.. సినీ రంగంలోని పలు విషయాలపై కూడా రేవంత్ రెడ్డితో బాలకృష్ణ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.


ప్రధాన కారణం ఏంటంటే..?

హైదరాబాద్ లో బసవతారకం ఫౌండేషన్ నిర్వహిస్తున్న కేన్సర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ట్రస్ట్ అధిపతిగా ఉన్న బాలకృష్ణ గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో, సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిన సందర్భం వచ్చింది. తాజా భేటీలో ఈ వ్యవహారంపై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఆ ధరఖాస్తును త్వరలోనే ఆమోదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు నేరుగా ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. తాజాగా బాలకృష్ణ కూడా సీఎం రేవంత్ ని నేరుగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికలతో బిజీగా ఉన్న ఆయన, వీలు చూసుకుని ఇప్పుడు సీఎంని కలిశారు. 

Tags:    
Advertisement

Similar News