వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డి తండ్రికి బెయిల్ నిరాకరణ

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా బెయిలు ఇవ్వలేమని చెప్పింది.

Advertisement
Update: 2023-09-04 07:16 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి ఈరోజు తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా బెయిలు ఇవ్వలేమని చెప్పింది. దీంతో వారిద్దరికీ మరోసారి నిరాశ ఎదురైందనే చెప్పాలి.

సీబీఐ ఈ కేసు విచారణలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించింది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరూ సీబీఐ కోర్టులో బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్న ఈ సందర్భంలో బెయిలివ్వడం కుదరదని కోర్టు చెప్పింది. వారి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఆ తర్వాత వారిద్దరూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ వివేకా హత్యకేసు సుదీర్ఘ విచారణ ఇంకా కొనసాగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం ముందస్తు అరెస్ట్ లేకుండా కోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. అయితే ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి మాత్రం బెయిలు లభించలేదు. వయసు, ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించినా కోర్టు మాత్రం బెయిలివ్వడానికి నిరాకరించింది. సీబీఐ కోర్టు బెయిలివ్వకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించినా ఫలితం లేదు. హైకోర్టు కూడా వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. 

Tags:    
Advertisement

Similar News