బెంగళూరు పోలీసులకు హేమ ఝలక్

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న 101 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయింది.

Advertisement
Update: 2024-05-27 07:27 GMT

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులకు ఝలక్ ఇచ్చింది నటి హేమ. విచారణకు హాజరుకాలేనంటూ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు లెటర్ రాసింది. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నందు వల్ల ఇవాళ విచారణకు రాలేనని తెలిపింది. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. మరోసారి నోటీసులిస్తారని తెలుస్తోంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇన్నిరోజులు తాను రేవ్ పార్టీకే వెళ్లలేదని బుకాయించిన హేమ.. తాజాగా విచారణకు గడువు కోరుతూ సీసీబీకి లేఖ రాయడంపై విమర్శలొస్తున్నాయి.

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న 101 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికీ సీసీబీ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో ముందుగా 8 మందికి సీసీబీ పోలీసులు నోటీసులిచ్చారు. వీరిలో నటి హేమ కూడా ఉంది. హేమ మాత్రం మొదట్నుంచీ తాను రేవ్‌పార్టీలో లేనంటూ బుకాయిస్తూ వస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. కట్‌చేస్తే బెంగుళూరు పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేశారు. దీంతో హేమ అడ్డంగా బుక్కయింది. హేమ ఈ పార్టీకి తన పేరుతో కాకుండా కృష్ణవేణి అనే పేరుతో హాజరైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కేసును ఎలా డీల్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News