ఇకపై వాట్సాప్ లో ఎక్స్ పైరింగ్ గ్రూప్స్

ఈ ఆప్షన్లలో రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్ల ద్వారా గ్రూప్ ఎన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలో తేదీని ఫిక్స్ చేసుకోవచ్చు.

Advertisement
Update: 2023-03-09 02:38 GMT

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందిస్తోంది. తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ లో పర్సనల్ చాటింగ్ తో పాటు ఫ్రెండ్స్, కొలిగ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తో చాటింగ్ కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవి దాదాపు వాట్సాప్ లో పర్మినెంట్ గా కొనసాగుతూ ఉంటాయి.

అయితే కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అవసరాల కోసం వాట్సాప్ లో గ్రూప్ లు క్రియేట్ చేస్తుంటారు. మ్యారేజ్ వంటి ఫంక్షన్లు నిర్వహించడం కోసం, టూర్లకు వెళ్లడం కోసం, ముఖ్యమైన సమావేశాల నిర్వహణ కోసం చర్చలు జరపడానికి వాట్సాప్ లో తాత్కాలిక గ్రూపులు క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా క్రియేట్ చేయబడ్డ గ్రూప్స్ ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత కూడా పర్మనెంట్ గా ఉండిపోతుంటాయి. అయితే ఇకపై ఇటువంటి తాత్కాలిక గ్రూప్స్ ఆటోమేటిగ్ గా డిలీట్ అవడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

ఇకపై ఇటువంటి తాత్కాలిక గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్ పైరింగ్ డేట్ కూడా సెట్ చేసి ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా చెయ్యొచ్చు. తాత్కాలిక గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్తే గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేసిన వెంటనే మళ్లీ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్లలో రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్ల ద్వారా గ్రూప్ ఎన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలో తేదీని ఫిక్స్ చేసుకోవచ్చు.

అలా ఫిక్స్ చేసిన తేదీన ఆటోమేటిక్ గా తాత్కాలిక గ్రూపు డిలీట్ అవుతుంది. ఒకవేళ గ్రూప్ ను తాత్కాలిక అవసరాల కోసం ఏర్పాటు చేసినప్పటికీ దానిని లైవ్ లోనే ఉంచాలని నిర్ణయించుకుంటే రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ పై క్లిక్ చేసి మళ్లీ డేట్ ను మార్చుకోవచ్చు. అలా అడ్మిన్ గ్రూప్ ను ఎన్ని రోజులైనా లైవ్ లో పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ అతి త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

Tags:    
Advertisement

Similar News