వాట్సాప్ కొత్త ఫీచర్! మీతో మీరే చాట్ చేసుకోవచ్చు!

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఎంతో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ‘మెసేజ్ యువర్‌సెల్ఫ్’ అనే ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తుంది.

Advertisement
Update: 2022-12-05 07:05 GMT

వాట్సాప్ కొత్త ఫీచర్! మీతో మీరే చాట్ చేసుకోవచ్చు!

యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఎంతో ప్రయోగాత్మకంగా పరీక్షించిన 'మెసేజ్ యువర్‌సెల్ఫ్' అనే ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌‌ ద్వారా యూజర్లు తమతో తామే చాటింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగమేంటంటే..

వాట్సాప్‌లో తీసుకొస్తున్న 'మెసేజ్ యువర్ సెల్ఫ్' ఫీచర్ సాయంతో నోట్స్, రిమైండర్స్, అవసరమైన అప్‌డేట్స్‌ను యూజర్లు తమ నెంబరకు తామే పంపించుకోవచ్చు. షాపింగ్ లిస్ట్, నోట్స్, గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల లాంటివాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌లో సెల్ఫ్ మెసేజ్ చేసుకోవడం కోసం యూజర్లు ముందుగా లేటెస్ట్ వెర్షన్‌కి వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి, స్ర్కీన్‌ కింద కనిపించే 'న్యూ చాట్' బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కాంటాక్ట్స్ లిస్ట్ టాప్‌లో మీ కాంటాక్ట్ కనిపిస్తుంది. ఆ నంబర్‌ను సెలక్ట్ చేసుకుని మీకు మీరే మెసేజ్‌లు పంపించుకోవచ్చు.

ఫొటో గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్‌లోని ఫొటోలు, వీడియో, ఆడియో, డాక్యుమెంట్లను నేరుగా పంపించుకోవడం కోసం.. వాటిని సెలక్ట్ చేసి షేర్‌ బటన్‌పై టాప్ చేయాలి. ఆ లిస్ట్‌లో వాట్సాప్‌ని ఎంచుకుంటే.. అక్కడ మీ నంబరే ఫస్ట్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫీచర్ త్వరలోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Tags:    
Advertisement

Similar News