యూపీఐ పేమెంట్ పొరపాటున వేరేవాళ్లకు పంపితే..

ఇప్పుడు పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా లేదా తప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా.. పేమెంట్ వేరేవాళ్లకు వెళ్లిపోతుంది.

Advertisement
Update: 2022-12-08 12:35 GMT

యూపీఐ పేమెంట్ పొరపాటున వేరేవాళ్లకు పంపితే..

ఇప్పుడు పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా లేదా తప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా.. పేమెంట్ వేరేవాళ్లకు వెళ్లిపోతుంది. ఇలా చాలామందికి జరుగుతుంటుంది.

ఇలాంటి పొరపాట్లని సరిదిద్దడం కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ కొన్ని సూచనలు చేస్తోంది. పొరపాటున వేరొకరి బ్యాంక్ అకౌంటుకు డబ్బు పంపినప్పుడు తిరిగి వాటిని ఎలా పొందాలో వివరిస్తోంది.

చెల్లింపుల్లో పొరపాట్లు జరిగినప్పుడు సదరు యూపీఐ యాప్ సపోర్ట్‌ని తీసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లాంటి యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ కంప్లెయింట్ చేసి పేమెంట్ వాపసు కోసం రిక్వెస్ట్ చేయొచ్చు.

అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇంఇయా (NPCI) పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఎన్‌పీసీఐ అధికారిక వెబ్‌సైట్ npci.org.in లోకి వెళ్లి, 'వాట్ వి డూ(What we do)' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

తర్వాత 'యూపీఐ' ఆప్షన్ మీద క్లిక్ చేసి 'నెక్స్ట్' బటన్ నొక్కాలి. అక్కడ 'డిస్‌ప్యూట్ రిడ్రస్సల్ మెకానిజం' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 'కంప్లెయింట్స్' లోకి వెళ్లి మీ యూపీఐ వివరాలు, తప్పుగా ఎంటర్ చేసిన యూపీఐ వివరాలు, పంపిన మొత్తం, ట్రాన్సాక్షన్ డేట్.. ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత 'కంప్లెయిట్ రీజన్' లో 'Incorrectly transferred to another account' ఎంచుకుని కంప్లెయింట్ సబ్మిట్ చేయాలి. సదరు టీం మీ సమస్యను పరిష్కరిస్తుంది. అప్పటికీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే.. 30 రోజుల తర్వాత కాగితంపై కంప్లెయింట్ రాసి పోస్ట్/ఫ్యాక్స్/హ్యాండ్ డెలివరీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ సంబంధిత కార్యాలయానికి పంపొచ్చు.

Tags:    
Advertisement

Similar News