Samsung Galaxy M34 5G | త్వ‌ర‌లోనే భార‌త్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌

Samsung Galaxy M34 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్.. భార‌త్ మార్కెట్లోకి త‌న గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) త్వ‌ర‌లో రానున్న‌ది.

Advertisement
Update: 2023-06-15 15:29 GMT

Samsung Galaxy M34 5G | త్వ‌ర‌లోనే భార‌త్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌

Samsung Galaxy M34 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్.. భార‌త్ మార్కెట్లోకి త‌న గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) త్వ‌ర‌లో రానున్న‌ది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy M34 5G) 6.6 అంగుళాల సూప‌ర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ ఫుల్ హెచ్‌డీ+ రిజొల్యూష‌న్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, విజ‌న్ బూస్ట‌ర్ స‌పోర్ట్‌తో వ‌స్తున్న‌ద‌ని తెలుస్తున్నది. ఆండ్రాయిడ్ 13 విత్ వ‌న్ యూఐ 5.1 వ‌ర్ష‌న్‌పై ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్ సెట్ క‌లిగి ఉండ‌వ‌చ్చున‌ని భావిస్తున్నారు. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లోకి వ‌స్తున్న‌దని తెలుస్తున్న‌ది..

శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్స్ మెయిన్ కెమెరా విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) స‌పోర్ట్‌తో వ‌స్తుంది. 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 5-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్ కెమెరా కూడా ఉంటాయి. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెపాసిటీ గ‌ల ఫ్రంట్ కెమెరా ఉంటుంద‌ని తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికైతే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ స్పెషిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు మార్కెట్లోకి రాలేదు.

అంతేకాదు.. శాంసంగ్ భార‌త్ మార్కెట్లోకి నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఫోల్డ‌బుల్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 5.. వ‌చ్చేనెల‌లో మార్కెట్లోకి విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ఇక త్వ‌ర‌లో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ద‌ని భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్‌.. సంస్థ ఇండియా వెబ్ సైట్‌లో క‌నిపించింది. ఎస్ఎం-ఎం346బీ/డీఎస్ మోడ‌ల్ నంబ‌ర్ కూడా వ‌చ్చింది. ఈ ఫోన్‌కు బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్ కూడా ల‌భించింది. ఈ ఏడాది ప్రారంభంలో భార‌త్ మార్కెట్లోకి విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌లోని ఫీచ‌ర్లు, స్పెషిపికేషన్లే త్వ‌ర‌లో వ‌చ్చే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్‌లోనూ ఉంటాయ‌ని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News