Realme Narzo N53 | రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 నుంచి కొత్త వేరియంట్‌.. ధ‌రెంతంటే..?!

Realme Narzo N53 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) గ‌త మే నెల‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update: 2023-10-25 12:28 GMT

Realme Narzo N53 | రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 నుంచి కొత్త వేరియంట్‌.. ధ‌రెంతంటే..?!

Realme Narzo N53 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) గ‌త మే నెల‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. రెండు స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భ్యం అవుతుంది. తాజాగా రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) కొత్త స్టోరేజీ వేరియంట్ తీసుకొచ్చింది. న్యూ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. తాజాగా ఆవిష్క‌రించిన 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఫీథ‌ర్ బ్లాక్‌, పీథ‌ర్ గోల్డ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. సూప‌ర్ వూక్ చార్జింగ్ మద్ద‌తుతోపాటు ఒక్టాకోర్ ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్యుయ‌ల్ కెమెరా, టాప్ డిస్‌ప్లేలో వాట‌ర్ డ్రాప్ నాచ్‌లో సెంట‌ర్ అలైన్డ్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.

రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.7,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.9,499ల‌కు ల‌భిస్తుంది. తాజాగా ఆవిష్క‌రించిన 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,999ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు.

రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 180 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్ మ‌ద్ద‌తుతో 6.74 అంగుళాల డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. రియ‌ల్‌మీ మినీ క్యాప్సుల్ (Realme Mini Capsule)తోపాటు ఓక్టాకోర్ యూనిసోక్ టీ612 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 4.0 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఏఐ ఆధారిత‌ 50- మెగాపిక్సెల్ ఆధారిత ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 33వాట్ల సూప‌ర్ వూక్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. ఈ ఫోన్ బ్యాట‌రీ 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది.

రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) ఫోన్‌లో సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. బ్లూటూత్ 5.0, 4జీ, జీపీఎస్‌, గ్లోనాస్‌, యూఎస్బీ టైప్‌-సీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News