యూట్యూబ్ రికమెండేషన్స్ ఇలా రీసెట్ చేయొచ్చు!

యూట్యూబ్‌లో చూస్తున్న వీడియోలను బట్టి యాప్.. రకరకాల వీడియోలను రికమెండ్ చేస్తుంటుంది. ఇవి కొందరికి ఉపయోగకరంగా అనిపిస్తే మరికొందరికి చిరాకుగా అనిపిస్తుంది.

Advertisement
Update: 2023-03-27 10:07 GMT

YouTube recommendations: యూట్యూబ్ రికమెండేషన్స్ ఇలా రీసెట్ చేయొచ్చు!

యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్‌లో రకరకాల వీడియోలు కనిపిస్తాయి. అయితే ఇవి అందరికీ ఒకేలా ఉండవు. యూట్యూబ్‌లో చూస్తున్న వీడియోలను బట్టి యాప్.. రకరకాల వీడియోలను రికమెండ్ చేస్తుంటుంది. ఇవి కొందరికి ఉపయోగకరంగా అనిపిస్తే మరికొందరికి చిరాకుగా అనిపిస్తుంది. యూట్యూబ్ రికమెండేషన్స్ నచ్చకపోతే వాటిని రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగంటే..

యూట్యూబ్‌లో యూజర్లు చూస్తున్న వీడియోలు, వాచ్ టైమ్, షేర్ చేయడం లాంటి యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసి, యూట్యూబ్ రకరకాల వీడియోలను సజెస్ట్ చేస్తుంది. ఇవి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చనప్పుడు వాటిని రీసెట్ చేసుకుంటే మళ్లీ ఫ్రెష్‌గా కొత్త రికమెండేషన్స్ వస్తాయి.

రికమెండేషన్స్‌ను రీసెట్ చేయడం కోసం ముందుగా ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ ఓపెన్ చేయాలి. ‘హిస్టరీ అండ్ ప్రైవసీ’ ఆప్షన్ లోకి వెళ్లి, ‘క్లియర్ సెర్చ్ హిస్టరీ’ నొక్కాలి. తర్వాత ‘కన్ఫర్మ్’ నొక్కి హిస్టరీ క్లియర్ చేయాలి.

సెర్చ్ హిస్టరీతో పాటు డేటా కూడా క్లియర్ చేయాలి. దీనికోసం ‘సెట్టింగ్స్’లో ‘యువర్ డేటా ఇన్ యూట్యూబ్’లోకి వెళ్లాలి. అక్కడ ‘యూట్యూబ్ వాచ్ హిస్టరీ’కి వెళ్లి ‘మేనేజ్ హిస్టరీ’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘డిలీట్’ బటన్ నొక్కి ‘డిలీట్ ఆల్‌టైం’పై క్లిక్ చేయాలి. ‘కన్ఫర్మ్’ చేసి ‘ఓకే’ నొక్కితే డేటా మొత్తం క్లియర్ అవుతుంది. తర్వాత రికమెండేషన్స్ ఫ్రెష్‌గా మొదలవుతాయి.

Tags:    
Advertisement

Similar News