యూట్యూబ్‌లో స్మార్ట్‌ సెర్చ్‌ ఇలా..

యూట్యూబ్‌లో ఎఫెక్టివ్‌గా సెర్చ్ చేసేందుకు కొన్ని టూల్స్‌ అండ్ టెక్నిక్స్‌ను అందుబాటులో ఉంచింది గూగుల్

Advertisement
Update: 2023-03-22 12:56 GMT

YouTube Smart Search: యూట్యూబ్‌లో స్మార్ట్‌ సెర్చ్‌ ఇలా..

యూట్యూబ్‌లో ఉన్నంత వీడియో కంటెంట్ మరే ప్లాట్‌ఫామ్‌లో ఉండదు. యూట్యూబ్‌లో ప్రతి నిమిషానికి కొన్నివేల వీడియోలు అప్‌లోడ్‌ అవుతూ ఉంటాయి. అయితే ఇన్ని వీడియోల మధ్యలో మనకు కావాల్సిన వీడియో వెతకడం నిజంగా కష్టమైన పనే. అందుకే యూట్యూబ్‌లో ఎఫెక్టివ్‌గా సెర్చ్ చేసేందుకు కొన్ని టూల్స్‌ అండ్ టెక్నిక్స్‌ను అందుబాటులో ఉంచింది గూగుల్. యూట్యూబ్‌లో స్మార్ట్‌గా ఎలా సెర్చ్ చేయాలంటే..

యూట్యూబ్‌లో ఈ వారం లేదా ఈ నెలలో అప్‌లోడ్ అయిన వీడియోలు వెతకాలంటే సెర్చ్‌ బాక్స్‌లో కావాల్సిన టాపిక్ టైప్ చేశాక ‘ఈ వారం’ లేదా ‘ఈ నెల’ అని కూడా ఎంటర్‌ చేయాలి. ఉదాహరణకు ‘ తెలుగు న్యూస్ దిస్ వీక్ (telugu news this week)’ అని టైప్ చేస్తే ఈ వారం అప్‌లోడ్ అయిన న్యూస్ వీడియోలే కనిపిస్తాయి.

యూట్యూబ్‌లో ఉండే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా అప్‌లోడ్ టైం, వ్యూస్, వీడియో క్వాలిటీ, వీడియో టైప్, డ్యూరేషన్ ఇలా రకరకాలుగా సెర్చ్ రిజల్స్ట్‌ను ఫిల్టర్ చేయొచ్చు.

యూట్యూబ్‌లో పాట పేరు పక్కన కామా పెట్టి పాడినవారి పేరు టైప్‌ చేస్తే ఒరిజినల్ పాటలు మాత్రమే కనిపిస్తాయి.

యూట్యూబ్‌లో ‘+’, ‘–’ సింబల్స్‌తో కూడా సెర్చ్ చేయొచ్చు. ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఒకటే కీవర్డ్ అవ్వడం వల్ల డొనాల్డ్ డక్‌కు సంబంధించిన వీడియోలు కూడా కనిపించే అవకాశం ఉంది. అందుకే సెర్చ్ చేసేటప్పుడు ‘డొనాల్డ్ ట్రంప్ – డక్’ అని టైప్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్ నుంచి డక్ వీడియోలు ఎలిమినేట్ అవుతాయి. అలాగే ‘+’ ఉపయోగించి రెండు కీవర్డ్స్‌ను కలిపి సెర్చ్ చేయొచ్చు

యూట్యూబ్‌లో ‘ఇన్‌టైటిల్’ అనే కమాండ్ ఉపయోగించి వీడియో టైటిల్స్‌ను నేరుగా వెతకొచ్చు. సెర్చ్ బాక్స్‌లో intitle: “messi speech” అని టైప్ చేస్తే ఆ టైటిల్‌లో ఆ పదం ఉన్న వీడియోలే కనిపిస్తాయి.

Tags:    
Advertisement

Similar News