ట్విట్టర్‌‌లో మూడు రకాల టిక్‌లు!

Gold, Grey, Blue Tick On Twitter: కంపెనీలకు గోల్డ్ కలర్ టిక్ మార్క్, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్‌కు బూడిద రంగు టిక్ మార్క్‌, వ్యక్తిగత వెరిఫైడ్ అకౌంట్‌లకు బ్లూ కలర్ టిక్ మార్క్‌లు ఉంటాయని మస్క్ తెలిపాడు.

Advertisement
Update: 2022-11-30 10:44 GMT

ట్విట్టర్‌‌లో మూడు రకాల టిక్‌లు!

ఎలన్ మస్క్ ట్విట్టర్‌‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్‌‌లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు బ్లూటిక్ లాంటి మూడు రకాల కొత్త టిక్‌లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

వ‌చ్చే వారం నుంచి ట్విట్టర్‌‌లో వెరిఫైడ్ స‌ర్వీస్‌ల‌ను ప్రారంభించ‌నున్నట్టు సీఈవో ఎల‌న్ మ‌స్క్ తెలిపారు. వివిధ ర‌కాల వెరిఫైడ్ ఖాతాల‌కు మూడు రంగుల బ్యాడ్జెస్‌ ఉంటాయ‌ని శుక్రవారం మ‌స్క్ ట్వీట్ చేశాడు.

కంపెనీలకు గోల్డ్ కలర్ టిక్ మార్క్, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్‌కు బూడిద రంగు టిక్ మార్క్‌, వ్యక్తిగత వెరిఫైడ్ అకౌంట్‌లకు బ్లూ కలర్ టిక్ మార్క్‌లు ఉంటాయని మస్క్ తెలిపాడు. వెరిఫై చేసిన అకౌంట్లకు టిక్ మార్కుల‌ యాక్టివేష‌న్‌కు ముందే మాన్యువ‌ల్‌గా అథెంటికేష‌న్ చేస్తామ‌ని కూడా మ‌స్క్ ప్రకటించాడు.

ఈ సందర్భంగా మస్క్.. "ట్విట్టర్‌‌లో వెరిఫికేష‌న్ బ్యాడ్జెస్ తేవ‌డం ఆల‌స్యం అయినందుకు క్షమించండి. వెరిఫైడ్ చెక్ మార్క్‌ల‌ను వ‌చ్చే శుక్రవారం తీసుకొస్తున్నాం" అని ట్వీట్‌ చేశాడు. ఎనిమిది డాల‌ర్లకు బ్లూ టిక్ వెరిఫికేష‌న్ ప్లాన్ తీసుకొచ్చిన మస్క్.. ఫేక్ అకౌంట్స్ తట్టుకోలేక ఆ ప్లాన్ రద్దు చేశాడు. వ్యక్తిగత వెరిఫైడ్ అకౌంట్లకు మ్యాన్యువల్ అథెంటికేషన్ ద్వారా బ్యాడ్జెట్ ఇస్తామని పేర్కొన్నాడు.

Tags:    
Advertisement

Similar News