ఇరవై వేల లోపు బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే!

5G Mobiles Under 20000 in India: ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అన్ని టెలికం సంస్థలు 5జీ నెట్‌వర్క్‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి.

Advertisement
Update: 2022-11-19 08:41 GMT

ఇరవై వేల లోపు బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే!

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అన్ని టెలికం సంస్థలు 5జీ నెట్‌వర్క్‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంతో చాలామంది 5జీ మొబైల్‌కు అప్‌డేట్ అవ్వాలనుకుంటున్నారు. అయితే 5జీ సపోర్ట్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సిన పనిలేదు. రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకూ బడ్జెట్‌లో మంచి 5జీ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి..

శాంసంగ్ ఎమ్ 33 5జీ ( Samsung Galaxy M33 5G)

శాంసంగ్ నుంచి మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటే ఎమ్ 33 బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ ధర రూ. 16,999 ఉంది.120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది.25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.ఇది శాంసంగ్ ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 12 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ (Samsung Galaxy M13 5G)

శాంసంగ్ నుంచి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 5జీ మొబైల్ ఇది. అమేజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 13,999 ఉంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G)

రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ మొబైల్ ధర రూ. 13,999 ఉంది. ఇది మిడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా,8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ మొబైల్ ఏడు 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఒప్పో ఏ74 5జీ ( Oppo A74 5G)

ఒప్పో ఏ74 5జీ మొబైల్ ధర రూ. 14,990 ఉంటుంది. ఇందులో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు బ్యాక్- ట్రిపుల్ కెమెరా సెటప్- ఉంటుంది.48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఐదు రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఐకూ జెడ్ 6 5జీ (iQOO Z6 5G)

ఈ మొబైల్ ధర రూ. 15,499 గా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే ఇది కేవలం రెండు 5జీ బ్యాండ్స్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News