'ఇదిగో ఇవే ఫోన్లు... ధ్వంసం చేశాన‌ని అబద్దపు ప్రచారం చేశారు'

తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని వాటిని ఈ రోజు ఈడీ అధికారులకు స్వాధీనం చేస్తున్నానని కవిత చెప్పారు.

Advertisement
Update: 2023-03-21 07:29 GMT

ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇంటి నుంచి ఆమె విచారణకు బయలు దేరేప్పుడు రెండు కవర్లలో 9 ఫోన్లను బహిరంగంగా ప్రదర్శించారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు.

తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని వాటిని ఈ రోజు ఈడీ అధికారులకు స్వాధీనం చేస్తున్నానని ఆమె చెప్పారు.

మరో వైపు కల్వకుంట్ల కవిత ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ రాశారు. తాను పాత ఫోన్లను ధ్వంసం చేశానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తన లేఖలో తప్పుబట్టారు. తన పట్ల ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తాను ఫోన్లను ఈడీకి స్వాధీనం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ఆమె హక్కులకు భంగం కలిగించడమే అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. తనను వివరణ అడగకుండానే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ నిర్దారణకు ఎలా వచ్చిందని కవిత ప్రశ్నించారు. ఈ అబద్దపు వార్తను ఈడీ మీడియాకు ఎలా లీక్ చేస్తారని ఆమె అడిగారు. తన, తన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం కోసమే ఈడీ ఈ విధంగా చేస్తున్నదని ఆమె ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News