ఎలక్షన్ కమిషనర్‌ను టార్గెట్ చేసిన గవర్నర్

పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలుండగా ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హాపై షేక్‌స్పియర్‌ నవలలు హ్యామ్లెట్, మెక్బెత్, షారూఖ్ ఖాన్ సినిమాలోని డైలాగ్‌ల‌తో విరుచుకుపడ్డారు.

Advertisement
Update: 2023-07-07 10:32 GMT

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలు, గవర్నర్ల మధ్య వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వ్యవహరిస్తున్న తీరు చర్చానీయాంశంగా మారింది. గవర్నర్లు అనవసరంగా తమ అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని గవర్నర్ల తీరును తప్పుబుడుతున్నారు. గవర్నర్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ లేని అధికారంతో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే చర్చ కూడా మొదలైంది.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలుండగా ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హాపై షేక్‌స్పియర్‌ నవలలు హ్యామ్లెట్, మెక్బెత్, షారూఖ్ ఖాన్ సినిమాలోని డైలాగ్‌ల‌తో విరుచుకుపడ్డారు. మోకాళ్లోతు పాపాల్లో మునిగిపోయావని నిందించాడు. 'సామాన్యుడి శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు' అనే 2013లో రిలీజైన షారూఖ్ ఖాన్ ఫిల్మ్ చెన్నై ఎక్స్ ప్రెస్‌లోని పాపులర్ డైలాగ్‌ను పలుసార్లు వాడారు. షేక్‌స్పియర్‌ 'హ్యామ్లెట్'లోని మర్డరర్స్ మోస్ట్ ఫౌల్ గురించి మాట్లాడుతూ... జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరించారు.

ఈ నెల 8న పంచాయతీ ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో చెలరేగే రాజకీయ హింస ఆపడంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విఫలమైనట్టు గవర్నర్ ఆరోపించారు. 48 గంటల్లో ఎన్నికల హింసను ఆపేలని గత సోమవారం వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రాజ్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతూ... వాళ్లు మానవ జీవితాలతో ఆడుకుంటున్నారు...ఈ హింసకు బాధ్యులెవరు..? హంతకులెవరో ఎన్నికల కమిషనర్‌కు తెలియాలి. ఎన్నికల కమిషనర్ మోకాళ్లలోతు పాపాల్లో మునిగిపోయారు. తాను మిమ్మల్ని నియమించాను. మీరు నన్ను నిరాశకు గురి చేశారు. విధి నిర్వహణలో మీరు ఫెయిలయ్యారు అని నిందించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయితే ఎవరు హంతకులు అని ప్రశ్నించారు. తాను బెంగాల్ ప్రజలకు మాటిచ్చాను. ప్రజలు నా సొంతం. ప్రజల మాటే...భగవంతుని మాట అంటూ ఒక్కో డైలాగ్ వదులుతూ ఎన్నికల కమిషనర్‌ను అవహేళ చేసేలా మాట్లాడారు. దీంతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మరోసారి తెరమీదికొచ్చింది.

Tags:    
Advertisement

Similar News