వధువుకి వరుడి ముద్దు.. రణరంగంగా మారిన కళ్యాణమండపం

పెళ్లి వేడుకలో వరుడు వధువుకి పెట్టిన ముద్దు పెద్ద రగడే సృష్టించింది. ఎంత పెళ్లి కొడుకు అయితే మాత్రం పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా బహిరంగంగా ముద్దు పెట్టడం ఏంటని వధువు తరపు వారు గొడవకు దిగారు. ఈ వివాదం కాస్త తీవ్రం అవడంతో ఇరువర్గాలవారు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు.

Advertisement
Update: 2024-05-24 03:20 GMT

పెళ్లి వేడుకలో వరుడు వధువుకి పెట్టిన ముద్దు పెద్ద రగడే సృష్టించింది. ఎంత పెళ్లి కొడుకు అయితే మాత్రం పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా బహిరంగంగా ముద్దు పెట్టడం ఏంటని వధువు తరపు వారు గొడవకు దిగారు. ఈ వివాదం కాస్త తీవ్రం అవడంతో ఇరువర్గాలవారు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. హాపూర్ కు చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో వివాహాలకు ఏర్పాట్లు చేశాడు. పెద్ద కుమార్తె వివాహం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది.

ఆ తర్వాత రెండవ కుమార్తె లగ్నం జరుగుతోంది. వరుడు వధువు మెడలో వరమాల వేసిన తర్వాత వధువు ఇష్టం చూపకపోయినా బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది వధువు తరపు వారికి నచ్చలేదు. దీనిపై వరుడిని ప్రశ్నించడంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది.

ఇంతలో వధువు తరపు వారు, వరుడు తరపు వారు కళ్యాణ వేదిక పైకి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అప్పటివరకు మేళతాళాలతో పచ్చగా ఉన్న కళ్యాణ మండపం కాస్త రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకొని కళ్యాణ మండపం వద్దకు వచ్చిన పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె వద్దంటున్నా వరుడు బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడని.. వధువు కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. వధువు అంగీకారంతోనే ఆమెను ముద్దు పెట్టుకున్నట్లు వరుడు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News