ఉపగ్రహానికి దివంగత కన్నడ నటుడు పునీత్ పేరు !

Puneeth Rajkumar Satellite: విద్యార్థులు తయారు చేసిన ఓ ఉపగ్రహానికి దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రూ.1.90 కోట్లతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.

Advertisement
Update: 2022-11-04 09:31 GMT

దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన 'కేజీఎస్‌- 3 శాట్'కు పునీత్ పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని న‌వంబ‌ర్ నెలాఖ‌రున తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సి 54 రాకెట్ ద్వారా నింగిలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే.

బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రూ.1.90 కోట్లతో కెజిఎస్‌-3 ఉపగ్రహాన్ని రూపొందించారు. గత అక్టోబర్‌లో మరణించిన దివంగత నటుడు జ్ఞాపకార్థం శాటిలైట్‌కి పునీత్ అని పేరు పెట్టారు.

తన దాతృత్వ , మాన‌వ‌త్వ సేవ‌ల‌కు, కన్నడ సినిమాకు చేసిన కృషికి పునీత్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 'కన్నడ రత్న' పురస్కారాన్ని ప్రకటించి ఆయన భార్యకు అందజేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మరణానంతరం మైసూర్ విశ్వవిద్యాలయం గౌర‌వ డాక్టరేట్ ను ప్ర‌క‌టించింది.

Tags:    
Advertisement

Similar News