ఆర్మీలో అక్రమ సంబంధాలపై సుప్రీం వ్యాఖ్యలు

ఆర్మీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు తీవ్ర మనోవేద‌న అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

Advertisement
Update: 2022-09-30 04:08 GMT

ఆర్మీలో అక్రమ సంబంధాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ సంబంధాలకు పాల్పడే ఆర్మీ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆర్మీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు తీవ్ర మనోవేద‌న అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

దంపతులు మధ్య పరస్సర విశ్వసనీయత ఉన్నప్పుడే సమాజంలో నిజాయితీ, నైతికత ఉంటుందన్నారు. వివాహేతర సంబంధాలు నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఆర్మీ అధికారులపై చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని.. దీనిపై మరింత వివరణ ఇవ్వాలని సుప్రీంను అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోరగా.. ఆ సందర్బంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

2018 తీర్పును చూపించి ఆర్మీ అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం సరికాదని.. ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 2018లో ఇచ్చిన తీర్పుపై లోతుగా పరిశీలన చేస్తామని.. అందుకు కొంత సమయం కావాలంటూ తదుపరి విచారణను డిసెంబర్‌ నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News