'నా డెత్ సర్టిఫికెట్ పోయింది దొరికినవాళ్ళు తెచ్చివ్వగలరు'... వైరల్‌ అయిన ఓ వ్యక్తి పేపర్‌ ప్రకటన

తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ ఓ వ్యక్తి ఇచ్చిన పేపేర్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొరికితే ఎక్కడికి తెచ్చివ్వాలి ? స్వర్గానికా ? నరకానికా ? అని నెటిజనులు చమత్కరిస్తున్నారు.

Advertisement
Update: 2022-09-23 10:04 GMT

ఇప్పుడీ పేపర్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాం నుంచి వచ్చిన ఓ పత్రికా ప్రకటనను IPS అధికారి రూపిన్ శర్మ షేర్ చేశారు. రంజిత్‌ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఆ ప్రకటనలో... ''ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద నా డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాను. '' అని ఉంది అందులో ఆ డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చాడు.

అయితే ఈ పేపర్ కటింగ్ ను IPS అధికారి రూపిన్ శర్మ షేర్ చేసి "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని కామెంట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజనులు దీనిపై ఫన్నీగా స్పంధిస్తున్నారు. ఒక వేళ సర్టిఫికెట్ దొరికితే ఎక్కడికి తెచ్చివ్వాలి ? స్వర్గానికా ? నరకానికా ? అని ఓ నెటిజన్ స్పందిస్తే ''ఒక వ్యక్తి తన డెత్‌ సర్టిఫికేట్‌ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి. దీనిని అర్జెంట్‌గా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది'' అని మరో నెటిజన్ కామెంట్‌ చేశారు. ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి అని మరొకరు వ్యాఖ్యానించారు.

అయితే ఆ రంజిత్ కుమార్ పోగొట్టుకున్న డెత్ సర్టిఫికెట్ ఎవరిదన్న విషయం మాత్రం తేలలేదు. నిజంగా ఆ సర్టిఫికెట్ ఆయనేదేనంటారా ?

Tags:    
Advertisement

Similar News