కర్నాటకలో కాంగ్రెస్‌కి అనుకూల పవనాలు..

కోస్తా కర్నాటక, సెంట్రల్ కర్నాటక మినహా.. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టమవుతోంది. ముఖ్యంగా మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉందని రిజల్ట్ చెబుతున్నాయి.

Advertisement
Update: 2023-05-13 03:50 GMT

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత స్పష్టమైపోయింది. ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత నుంచి కాంగ్రెస్ ఆధిక్యత రుజువవుతోంది. ప్రీ పోల్ అంచనాలు, ఎగ్జిట్ పోల్ అంచనాలు సరైనవేననే చర్చ నడుస్తోంది. దాదాపు 116 స్థానాలకు పైగా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. అయితే మేజిక్ ఫిగర్ విషయంలో తుది ఫలితాలు స్పష్టత ఇస్తాయి.

కోస్తా కర్నాటక, సెంట్రల్ కర్నాటక మినహా.. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టమవుతోంది. ముఖ్యంగా మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉందని తెలుస్తోంది. బీజేపీ ఇక్కడ బాగా వెనకబడిపోతోంది.

కర్నాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. 113 సీట్ల సంఖ్యాబలం ఉన్న పార్టీకే అధికారం దక్కుతుంది. ఈ మేజిక్ ఫిగర్ కోసమే పార్టీలు కష్టపడుతున్నాయి. బీజేపీకి అది అసాధ్యం అని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్‌కి కూడా ఆ స్థాయిలో సీట్లు రాకూడదు అని బీజేపీ కోరుకుంటోంది. అదే నిజమైతే మరోసారి పార్టీలను చీల్చి పబ్బం గడుపుకోవాలనేది కమలదళం ఆశ. అయితే 2023 ఎన్నికలు మాత్రం కాంగ్రెస్‌కి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చేలా కనపడుతున్నాయి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ని నిజం చేయబోతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News