హార్దిక్ పాండ్యాకు మరో షాక్‌.. నటాషా విడాకులు?

గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో ముంబైకి మారాడు. కానీ, అతని సారథ్యంలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టింది.

Advertisement
Update: 2024-05-25 03:36 GMT

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్‌ పాండ్యాకు సంబంధించి మరోవార్త సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యా దంపతులు విడిపోయారనే వార్తలు వైరల్‌గా మారాయి. హార్దిక్ పాండ్యా, నటాషా ఒకరి గురించి ఒకరు ఇన్‌స్టాలో పోస్టు చేసుకోవడం మానేసినట్లు గుర్తించిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోయారని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ నటాషా సైతం ఇన్‌స్టాలో తన పేరు చివర పాండ్యాను తొలగించింది.

మార్చి 4 నటాషా పుట్టినరోజు కాగా, ఆమెకు విషేస్ చెప్తూ పాండ్యా ఎలాంటి పోస్టు చేయలేదు. గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో ముంబైకి మారాడు. కానీ, అతని సారథ్యంలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో నెటిజన్లు పాండ్యాను తీవ్రంగా ట్రోలింగ్ చేశారు.

పాండ్యా, నటాషాల దూరాన్ని రెడిట్‌ సైతం ధృవీకరించింది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని తెలిపింది. హార్దిక్‌ పాండ్యా, నటాషాతో కలిసి పోస్టు చేసిన చివరి ఫొటో వాలంటైన్స్‌ డే నాటిది. హార్దిక్, నటాషా 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా జరుగుతున్న ప్రచారంపై హార్దిక్ పాండ్యా కానీ, నటాషా కానీ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    
Advertisement

Similar News