హర్యానాలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మృతి - సంక్షోభంలో బీజేపీ సర్కార్

హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి మొదటినుంచి రాకేష్ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు రాకేష్ మృతితో బీజేపీకి అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గిపోయింది.

Advertisement
Update: 2024-05-25 11:43 GMT

హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సాయంతో బీజేపీ సర్కారును నడుపుతుండగా ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఇండిపెండెంట్‌గా నెగ్గిన రాకేష్ దౌల్దాబాద్(44) హర్యానా సర్కారులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇవాళ ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. బాద్షాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాకేష్ ఎన్నికల్లో నెగ్గి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి మొదటినుంచి రాకేష్ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు రాకేష్ మృతితో బీజేపీకి అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గిపోయింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి సొంతంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇండిపెండెంట్ల సాయం తీసుకుని సీఎం నయాబ్ సింగ్ ఎలాగోలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

కాగా, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కర్నాల్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గగా.. ఆయన నయాబ్ సింగ్ కోసం తన సీటును వదులుకున్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజిత్ చౌతాలా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ఆయన ఆశిస్తున్నారు.

హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం సాధారణ మెజారిటీకి 44 మంది సభ్యుల అవసరం ఉండగా.. బీజేపీకి 40 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. సీఎం నయాబ్ సింగ్ ఇండిపెండెంట్ల సాయం తీసుకొని ఎలాగోలా ప్రభుత్వాన్ని నడుపుతుండగా ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీకి మద్దతు ఇస్తున్న ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మృతి చెందడంతో నయాబ్ సింగ్ సర్కార్ సంక్షోభంలో పడింది.

Tags:    
Advertisement

Similar News