బీజేపీలో చేరనున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం, మాజీ కాంగ్రెస్ నేత, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. సోమవారంనాడు ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్టు సమాచారం.

Advertisement
Update: 2022-09-16 09:57 GMT

పంజాబ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరేందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు.

ఆయనను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడంతో ఆయన‌ కాంగ్రెస్ కు రాజీనామా చేసి 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరుతో స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల్లో చిత్తుగా ఓడి పోవడంతో ఆయన బీజేపీ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఆదివారం నాడు ఆయన ఢిల్లీకివెళ్ళి బీజెపి అగ్రనేతలతో సమావేశమవుతారు. సోమవారంనాడు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. అమరీందర్ కు పంజాబ్ బీజేపీ అధ్యక్ష పదవి కానీ, కేంద్రమంత్రి పదవి కానీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News